TTD: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తప్పిన ప్రమాదం

  • తిరుమల ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం
  • విజిలెన్స్ డిఎస్పీ అంకయ్య కారు నుంచి మంటలు
  • సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆలయానికి సమీపంలోని కారు పార్కింగ్‌ వద్ద విజిలెన్స్ డీఎస్పీ అంకయ్య కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఆలయ అధికారులు తెలిపారు. బ్యాటరీలో లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేకంలో పాల్గొనేందుకు అంకయ్య వచ్చినట్టు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
TTD
Fire Accident
Tirumala
Tirupati

More Telugu News