Bin Laden: లాడెన్ హత్య వార్త వినగానే.. ‘గుడ్ న్యూస్’ అన్న అప్పటి పాక్ అధ్యక్షుడు జర్దారీ!

  • ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా తొణకని జర్దారీ
  • జర్దారీకి తొలుత చెప్పిన తర్వాతే ప్రపంచానికి చెప్పిన ఒబామా
  • ఒబామా సహాయకుడు బెన్ రాసిన పుస్తకంలో పలు సంచలన విషయాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సహాయకుడిగా పనిచేసిన బెన్ రోడ్స్ రాసిన ‘ది వరల్డ్‌ యాజ్‌ ఇటీజ్‌: ఎ మెమోయిర్‌ ఆఫ్‌ ఒబామా వైట్‌ హౌస్‌’ పుస్తకంలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. మే 2, 2011న రాత్రి అమెరికా ప్రత్యేక బలగాలు పాక్‌లోని అబోటాబాద్‌లో లాడెన్ రహస్య స్థావరంపై దాడి చేసి అతడిని హతమార్చాయి. విషయం తెలిసిన ఒబామా వెంటనే పాక్ అధ్యక్షుడు జర్దారీకి ఫోన్ చేసి చెప్పారట. ‘గుడ్ న్యూస్. పర్యవసానాలు ఎలా ఉన్నా ఇది మంచి వార్తే. కాకపోతే ఇప్పటికే ఆలస్యమైంది’ అని ఆయన అన్నట్టు బెన్ రోడ్స్ తన పుసక్తంలో వివరించారు.

అంతేకాదు, ‘మీకు, అమెరికా ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు’ అని కూడా అన్నట్టు తెలిపారు. లాడెన్ హత్యతో పాక్ సార్వభౌమత్వానికి అమెరికా భంగం కలిగేలా వ్యవహరించినా జర్దారీ తొణకలేదని, దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా ఆందోళన చెందలేదని రోడ్స్ పేర్కొన్నారు. లాడెన్ మరణ వార్తను తొలుత జర్దారీకి తెలియజేసిన తర్వాతే ఒబామా అమెరికా ప్రజలకు వెల్లడించినట్టు రోడ్స్ ఆ పుస్తకంలో వివరించారు.
Bin Laden
Terrorist
America
Pakistan
Obama

More Telugu News