Puneeth Rajkumar: తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్

  • షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన
  • అనంతపురం వద్ద కారు టైరుకు పంక్చర్ 
  • పుకార్లను నమ్మవద్దని సూచన
కన్నట కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన తాజా చిత్రం ‘నట సార్వభౌమ’ సినిమా షూటింగ్ అనంతరం బళ్లారి నుంచి బెంగళూరుకు తన రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా అనంతపురం వద్ద కారు టైరు ఒక్కసారిగా పంక్చరై అదుపుతప్పింది.

అయితే, ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని పునీత్ ట్విట్టర్ ఖాతా నిర్ధారించింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది. సోషల్ మీడియా, న్యూస్ చానెళ్లలో వచ్చే పుకార్లను నమ్మవద్దని పునీత్ కార్యాలయ సిబ్బంది ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.
Puneeth Rajkumar
Kannada
Car
Road Accident

More Telugu News