ambati rambabu: రాష్ట్ర ప్రజలకు చెవిలో పూలు పెట్టింది చంద్రబాబే: అంబటి రాంబాబు

  • ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైసీపీని విమర్శిస్తారా?
  • మా ఎంపీల రాజీనామాలను అపహాస్యం చేసేలా మాట్లాడతారా?
  • బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుందనడం దారుణం
రాష్ట్ర ప్రజలకు చెవిలో పూలు పెట్టింది సీఎం చంద్రబాబేనని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైసీపీని చంద్రబాబు విమర్శించడం తగదని, తమ ఎంపీలు చేసిన రాజీనామాలను అపహాస్యం పాలు చేసేలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ ఎన్డీఏతో అంటకాగి ఇప్పుడు బయటకొచ్చిన టీడీపీ.. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుందంటూ మాట్లాడటం దారుణమని అన్నారు.  
ambati rambabu
Chandrababu

More Telugu News