Chandrababu: అధికారంలోకి వస్తే వాళ్లు జైలుకు వెళ్లడంతో పాటు ప్రజలను కూడా పంపిస్తారు: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లా పలసపల్లెలో నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు 
  • తప్పుడు పనులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
  • ఇలాంటి వారు రాష్ట్రానికి ఏం చేస్తారు?  
  • బీజేపీతో కలిసి వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోంది
కొందరు నాయకులు అధికారంలోకి వస్తే వాళ్లు జైలుకు వెళ్లడంతో పాటు ప్రజలను జైలుకు పంపిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పలసపల్లెలో ఈరోజు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... తప్పుడు పనులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతోన్న వారు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగదని, పని చేస్తోన్న పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నానని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ ప్రయత్నిస్తోందని, బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. 
Chandrababu
Andhra Pradesh
jail

More Telugu News