Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన ఊమన్ చాందీ

  • రాహుల్ నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్న చాందీ
  • ఏపీ ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారు
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పని చేస్తాం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిగా ఊమన్ చాందీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పార్టీ వ్యవహారాల బాధ్యత ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పటికీ మంచి పట్టు ఉందని, ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేస్తామని తెలిపారు. మరోవైపు, బెంగుళూరులో రాహుల్ గాంధీ, చంద్రబాబులు చేతులు కలిపినప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయాయంటూ బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊమన్ చాందీ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh
Congress
incharge
oommen chandy

More Telugu News