BJP: గవర్నర్‌ను కలిసి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఏపీ నేతలు

  • నరేంద్ర మోదీని దూషించారని ఫిర్యాదు
  • అఖిలప్రియ తీరు బాగోలేదని వ్యాఖ్య
  • అమిత్‌ షా కాన్వాయ్‌పై తిరుమలలో చేసిన దాడిపై కూడా ఫిర్యాదు?
బీజేపీ ఏపీ నేతలు ఈరోజు హైదరాబాదు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి, టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు తదితరులు ఉన్నారు. 2019 ఎన్నికల దృష్ట్యా టీడీపీ నేతలు, మంత్రులు మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అలాగే, ఏపీ మంత్రి అఖిలప్రియ తీరు బాగోలేదని, ఆమెను బర్తరఫ్‌ చేయాలని వారు గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తిరుమలకు వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు ఆయన కాన్వాయ్‌పై దాడి చేసిన తీరుపై కూడా వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.       
BJP
Andhra Pradesh
Telugudesam

More Telugu News