Pawan Kalyan: పవన్ కి మద్దతుగా ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్.. వైరల్!

  • ఒకప్పుడు బ‌న్నీకి, పవన్ కి మధ్య వైరం ఉందంటూ ప్ర‌చారం
  • తాజాగా పవన్ కి మద్దతుగా బన్నీ పోస్ట్
  • ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు
ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య వైరం ఉందంటూ తరచుగా సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొంతకాలం క్రితం పవన్ ఫిలిం ఛాంబ‌ర్‌ వద్ద చేపట్టిన నిరసనకి మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ అక్క‌డికి రావ‌డంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది. ఈమద్యే బన్నీ కూడా రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించాడు.

తాజాగా అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పవర్ స్టార్‌కి మద్దతు ప్రకటిస్తూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. "లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్‌నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్" అని అల్లు అర్జున్ రాసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan
Allu Arjun
Jana Sena
Tollywood
Hyderabad

More Telugu News