madalasa sharma: పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్ మదాలసశర్మ!

  • మిథున్ చక్రవర్తి కుమారుడిని పెళ్లాడబోతున్న మదాలసశర్మ
  • జూన్ 7న ముహూర్తం
  • విదేశాల్లో పెళ్లి జరగనున్నట్టు సమాచారం
సినీ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో భామ పెళ్లికి రెడీ అవుతోంది. ఆలస్యం అమృతం విషం, చిత్రం చెప్పిన కథ, రామ్ లీలా, ఫిట్టింగ్ మాస్టర్ వంటి చిత్రాల్లో నటించిన మదాలసశర్మ ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని వివాహం చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ టాక్. వీరి వివాహానికి జూన్ 7న ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. విదేశాల్లో పెళ్లి చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
madalasa sharma
mithun chakravarthy
mimo chakravarthi
tollywood
marriage

More Telugu News