Jagan: అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ఆదుకోవచ్చుగా?: టీడీపీ నేత లంకా దినకర్

  • అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువకే అమ్ముతున్నారనడం సబబు కాదు
  • జగన్ ముందుకొచ్చి రూ.15 వేల కోట్లకు ఆ ఆస్తులు కొనాలి
  • తద్వారా బాధితులను ఆదుకోవాలి
అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ముందుకొచ్చి రూ.15 వేల కోట్లకు అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయాలని, తద్వారా బాధితులను ఆదుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేస్తున్న విమర్శలపైనా ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లేవనెత్తిన అంశాలపై జీవీఎల్ స్పందించక పోగా, వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. ఈవిధంగా జీవీఎల్ వ్యాఖ్యలు చేయడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
Jagan
lanka dinakar

More Telugu News