ex jd: నాకు ‘ఆపరేషన్ గరుడ’ తెలియదు కానీ, కలామ్ చెప్పిన ‘గరుడ’ మాత్రం తెలుసు: లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
‘ఆపరేషన్ గరుడ’ గురించి తనకు తెలియదు కానీ, అబ్దుల్ కలామ్ చెప్పిన గరుడ గురించి అయితే  తెలుసని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన్ని మీడియా పలకరించింది. కలామ్ చెప్పినట్టు గరుడ పక్షిలాంటి దృక్పథం అలవరచుకోవాలని మాత్రమే తనకు తెలుసని అన్నారు.

సామాజిక వర్గం గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని, గడప దాటి బయటకు వచ్చిన తర్వాత సమాజమే తన వర్గమని, సామాజిక వర్గం అనే ఆలోచన నుంచి బయటపడితేనే సమాజ నిర్మాణం జరుగుతుందని అన్నారు. సమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటానని చెప్పిన లక్ష్మీనారాయణ, తాను ఏం చేసినా, చిత్తశుద్ధితో చేస్తానని, ప్రజాదరణ కోసం తానెప్పుడూ పనిచేయనని, పాకులాడనని, ప్రజాదరణ అనేది సైడ్ ఎఫెక్ట్ లాంటిదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
ex jd
lakshmi narayana

More Telugu News