Kodandaram: కొందరు రాజకీయ నాయకులు పేదల నుంచి భూములు లాక్కున్నారు: కోదండరాం

  • భూ రికార్డుల ప్రక్షాళనలో అవకతవకలు
  • గ్రామాల్లో అధ్యయనం చేస్తాం
  • కలెక్టరేట్‌ల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం
తెలంగాణలో జరుపుతోన్న భూ రికార్డుల ప్రక్షాళనలో అవకతవకలు జరిగాయని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... తాము గ్రామాల్లో అధ్యయనం చేసి, ఈ విషయంపై పరిష్కారం కోసం కలెక్టరేట్‌ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు.

భూ ప్రక్షాళనలో కొందరు రాజకీయ నాయకులు పేదల నుంచి భూములు లాక్కున్నారని కోదండరాం తెలిపారు. అలాగే, తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు పెట్టుబడి పథకం అవసరమని, అంతేగానీ భూ స్వాములకు డబ్బులు ఇవ్వడానికి కాదని విమర్శించారు.        
Kodandaram
tjs
Telangana

More Telugu News