Andhra Pradesh: ఏ అంశాన్నైనా రాజకీయం చేయడమే వాళ్లిద్దరి పని!: కుటుంబరావు

  • ‘అగ్రిగోల్డ్’ కేసు అంశంలో జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
  • రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు
  • లేనిపోని ఆరోపణలు చేయడాన్ని జీవీఎల్ ఇకనైనా మానుకోవాలి
ఏ అంశాన్నైనా రాజకీయం చేయడమే జగన్, విజయసాయిరెడ్డి పని అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అగ్రిగోల్డ్’ కేసు అంశంలో ప్రతిపక్ష నేత జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దురుద్దేశంతోనే దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ప్రభుత్వం పని తీరుపై ఎవరికైనా అనుమానాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను కుటుంబరావు ఖండించారు. ఏపీలో అభివృద్ధి అంతా కాగితాలకే పరిమితమైందని జీవీఎల్ వ్యాఖ్యానించారని, గ్రామాల్లో పర్యటించిన తర్వాత ఆ విషయాన్ని ఆయన చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని జీవీఎల్ ఇకనైనా మానుకోవాలని కుటుంబరావు హితవు పలికారు.
Andhra Pradesh
kutumbarao

More Telugu News