Jagan: మా ఎంపీలు రాజీనామాలు చేస్తే.. బుద్ధున్నవారు ఎవరైనా వారికి పోటీగా అభ్యర్థులను నిలబెడతారా?: జగన్
- ఉప ఎన్నికల్లో ఒకవేళ పోటీకి నిలబెడితే దాని అర్థం ఏంటీ?
- ప్రత్యేక హోదాకు వారు అనుకూలమనా?
- హోదాను పట్టించుకోమనా?
- ఇది నిజంగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి
తమ రాజీనామాలు ఆమోదించాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఈరోజు రాజీనామా ధ్రువీకరణ లేఖలను అందించారు. ఈ విషయంపై స్పీకర్ ఈరోజు లేక రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజక వర్గం మోర్తలో ఉన్న జగన్.. ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కుంటారా? అని జగన్‌ను విలేకరులు ప్రశ్నించారు.
దీనికి జగన్ సమాధానం చెబుతూ... "నిజంగా హోదా కోసం మా ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎవరైనా బుద్ధున్న నేతలు వారికి పోటీగా ఆయా పార్లమెంటు నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా? ఒకవేళ పెడితే దాని అర్థం ఏంటీ? ప్రత్యేక హోదాకు వారు అనుకూలమనా.. హోదాను పట్టించుకోమనా? ఇది నిజంగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. ఒకవేళ చంద్రబాబు అభ్యర్థులను నిలబెడితే అది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబుకి డిపాజిట్లు కూడా రావు కాబట్టి.
మరో 14 నెలలు ఎంపీలుగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ,
పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాల కోసం చిత్తశుద్ధితో మా ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆ ఐదుగురు ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నా. రాజకీయాల్లో నిజాయతీ ఉండాలి. చంద్రబాబుకి అది లేకపోవడం మనం చేసుకున్న కర్మ. 14 నెలలకు ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రాకుండా ఉంటాయా?" అని జగన్ ప్రశ్నించారు.
తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను కొందరికి కండువాలు కప్పి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని జగన్ విమర్శించారు. మరి వారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలకు ఎందుకు దిగడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇప్పటివరకు ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు? అని ప్రశ్నించారు.