kcr: కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సంతోషకర వార్తను తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర సాంకేతిక సలహా మండలి పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చింది. దీంతో, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టైంది.

ఈరోజు ఢిల్లీలో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులతో పాటు అన్ని అనుమతులకు కేంద్రం ఓకే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
kcr
Harish Rao
kaleswaram project

More Telugu News