Virat Kohli: విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. సెల్ఫీలు దిగుతున్న సందర్శకులు!

  • ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ లో కోహ్లీ మైనపు విగ్రహం  
  • ఈరోజు ఆవిష్కరించిన నిర్వాహకులు
  • కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ విగ్రహాల సరసన కోహ్లీ
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాల సరసన కెప్టెన్ విరాట్ కోహ్లీ విగ్రహం కూడా చేరింది. ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ లో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. కాగా, ఈ మ్యూజియంను తిలకించడానికి వచ్చే సందర్శకులు, కోహ్లీ అభిమానులు ఆయన మైనపు విగ్రహం పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తన మైనపు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కోహ్లీ తన అభినందనలతో పాటు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారని మ్యూజియం నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.    
Virat Kohli
madam tussads
delhi

More Telugu News