bjp: మిత్రపక్షాల విలువేంటో బీజేపీకి ఇప్పుడు తెలిసొచ్చింది!: మంత్రి యనమల

  • మిత్రపక్షాలకు మోదీ, అమిత్ షాలు ద్రోహం చేశారు
  • ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు
  • ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చాక మిత్రపక్షాల విలువేంటో వాళ్లకు తెలిసొచ్చింది
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక మిత్రపక్షాల విలువేంటో మోదీ, అమిత్ షాలకు తెలిసిందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోదీ, అమిత్ షాలు ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

ఇక, తమకు పుట్టగతులుండవని చెప్పి నష్ట నివారణా చర్యలు చేపట్టారంటూ మోదీ, అమిత్ షాలను దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షా అహంభావంతో అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను అగౌరవపరిచారని అన్నారు. ఇప్పుడేమో వాళ్ల ఇళ్లకు వెళ్లడం, శివసేన, అకాలీదళ్ పార్టీల చుట్టూ  మోదీ, అమిత్ షాలు ప్రదక్షిణాలు చేయడం చూస్తుంటే బీజేపీ ఎలాంటి దుస్థితిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ప్రజలకే కాదు తన భాగస్వామ్య పక్షాలకూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని యనమల మండిపడ్డారు.
bjp
Yanamala

More Telugu News