Karnataka: కర్ణాటకలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు

  • కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం
  • రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్-కాంగ్రెస్‌
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం కొనసాగుతోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలతో రాజ్‌భవన్‌లో కర్ణాటక గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మంత్రులుగా డీకే శివకుమార్‌, బండెప్ప కాశంపూర్‌, హెచ్‌ డీ రేవణ్ణ, ఆర్‌వీ దేశ్‌పాండే, జీటీ దేవెగౌడ, కేజే జార్జ్‌లతో పాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, కాంగ్రెస్‌ మద్దతుతో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ మంత్రివర్గ విస్తరణపై చర్చోపచర్చలు జరిపిన విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పుపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుని ఈరోజు విస్తరణ కార్యక్రమం నిర్వహించింది.
Karnataka
Congress
jds

More Telugu News