Yanamala: ఉప ఎన్నికలంటే వైసీపీకి భయమని దీంతో వెల్లడైంది: యనమల

  • ఢిల్లీలో వైసీపీ ఎంపీలు
  • రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌తో చర్చలు
  • బీజేపీ, వైసీపీ కలిసి నాటకం ఆడాయన్న యనమల
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శ
తమ రాజీనామాలు ఆమోదించాలంటూ వైసీపీ ఎంపీలు మరోసారి ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సంబంధిత అధికారులతో ఆమె చర్చిస్తున్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వారి రాజీనామాల నాటకాలు తుదిదశకు చేరాయని ఎద్దేవా చేశారు.

ఆలస్యంగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు రాకుండా చేయడంలో వారు సఫలమైనట్లే అనిపిస్తోందని, ఉప ఎన్నికలంటే వైసీపీకి భయమని దీంతో తేలిపోయిందని యనమల అన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి ఆడిన నాటకం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు.
Yanamala
Andhra Pradesh
YSRCP

More Telugu News