komatireddy venkatareddy: కోర్టు తీర్పుతో కేసీఆర్ ముఖమంతా వాచింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • తమ శాసనసభ సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలి
  • కోర్టు తీర్పుతో కేసీఆర్ ముఖం వాచిపోయింది
  • మిషన్ భగీరథ కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే కక్ష సాధింపు

కేవలం కక్ష సాధింపుతోనే తమ శాసనసభ సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక చెంప వాచిందని, ఆ తర్వాత ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ముఖం మొత్తం వాచి పోయిందని అన్నారు. తమ సభ్యత్వాలను ఇప్పటికైనా పునరుద్ధరించకపోతే... కోర్టు ధిక్కార కేసు కింద కేసీఆర్ ను, ప్రభుత్వంలోని ప్రధాన అధికారులను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.

మిషన్ భగీరథ కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని కోమటిరెడ్డి మండిపడ్డారు. అన్యాయంగా తన అనుచరుడు శ్రీనును హత్య చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గన్ మెన్లను కూడా తొలగించారని, నియోజకవర్గానికి నిధులు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించి... చెక్కు పంపిణీలు, ప్రారంభోత్సవాలను దొంగలు, రౌడీల చేత చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. 

More Telugu News