Drunk Driving: మత్తు వదిలింది.. 320 మంది మందు బాబులకు జైలు శిక్ష

  • మందు బాబులకు మత్తు వదిలిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • మే నెలలో పట్టుబడ్డ 1,373 మంది మందు బాబులు
  • ఒక రోజు నుంచి 13 రోజుల వరకు జైలు శిక్ష

హైదరాబాద్ (సైబరాబాద్ విభాగం) పోలీసులు మందు బాబులకు మత్తు వదిలిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, బాలాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, అల్వాల్, షాద్ నగర్ లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 1,373 మంది మందు తాగి, వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కూకట్ పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్ న్యాయస్థానాల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే, కేసు నమోదైన వారిలో కేవలం 773 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. కేసులను విచారించిన న్యాయమూర్తులు 320 మందికి శిక్షను ఖరారు చేశారు. వీరిలో 70 మందికి 6 నుంచి 13 రోజుల పాటు... 250 మందికి ఒకటి నుంచి 5 రోజుల పాటు జైలు శిక్షను విధించారు. మరోవైపు జరిమానాల రూపంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి రూ. 7,84,500 జమ అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News