Kate spade: ఆత్మహత్యకు పాల్పడ్డ లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ కేట్ స్పేడ్!

  • 1993లో ఫ్యాషన్ ప్రపంచంలోకి
  • ఎపానమస్ బ్రాండ్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
  • ఉరివేసుకుని ఆత్మహత్య
అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ కేట్ స్పెడ్ (55) అనుమానాస్పద స్థిలో మృతి చెందింది. న్యూయార్క్‌ సిటీ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేట్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కేట్‌ను గమనించిన పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు కేట్ సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. కేట్ 1993లో ఫ్యాషన్ వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాండ్ బ్యాగ్‌ల తయారీలో తనదైన ముద్ర వేసిన కేట్ సొంత ఫ్యాషన్ బ్రాండ్ ‘ఎపానమస్’కు ప్రపంచవ్యాప్తంగా 315 షాపులు ఉన్నాయి.
Kate spade
Fashion designer
Newyork

More Telugu News