Chandrababu: ఆ రోజున నా భర్త అస్థికలను గంగా, కావేరీ నదుల్లో కలుపుతా: లక్ష్మీపార్వతి

  • చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి
  • ఎన్టీఆర్ కు, ఆ కుటుంబానికి, తెలుగు ప్రజలకు ద్రోహం చేశావు
  • చేసిన ద్రోహానికి శిక్ష త్వరలో అనుభవించబోతున్నావు!
చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయని, ఆ పాపాలే ఆయన్ని కబళించి వేస్తాయంటూ వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘తెలుగు పాపులర్ టీవీ’ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నువ్వు (చంద్రబాబు) చేసుకున్న తప్పులే నిన్ను చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ కు, ఎన్టీఆర్ కుటుంబానికి, అదే విధంగా ఎన్టీఆర్ ని నమ్మి ఓటేసిన ఉభయరాష్ట్రాల తెలుగు ప్రజలకు నువ్వు చేసిన ద్రోహానికి శిక్ష త్వరలో అనుభవించబోతున్నావు. అది నేను కళ్లారా చూస్తాను. ఆరోజున నా భర్త అస్థికలను తీసుకెళ్లి గంగా, కావేరీ నదుల్లో కలుపుతాను’ అని అన్నారు.
Chandrababu
lakshmi parvathi

More Telugu News