Nara Lokesh: ప్రజలు తరిమి కొడతారు: బీజేపీకి ఏపీ మంత్రి లోకేశ్‌ హెచ్చరిక

  • విభజన హామీలపై నాలుగేళ్లు ఓపిక పట్టాం
  • కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది
  • ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు ఓపిక పట్టారని, కానీ కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా వినుకొండలో నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... చివరకు తిరుమల శ్రీవారిని కూడా అభాసుపాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు ప్రజలంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు? అని ప్రశ్నించారు.

ఏపీపై వివక్ష చూపితే బీజేపీని ప్రజలు తరిమి కొడతారని లోకేశ్‌ హెచ్చరించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని, అలాగే ప్రతిపక్షాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నాయని, అందుకే ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.
Nara Lokesh
Chandrababu
BJP
Telugudesam

More Telugu News