TTD: పరువు నష్టం దావా వేస్తాం: రమణ దీక్షితుల ఆరోపణలపై టీటీడీ ఈవో ప్రకటన

  • ఆభరణాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు
  • అవి ఉన్నాయని ఇప్పటికే స్పష్టం చేశాం
  • తిరుమలలో ఎలాంటి తవ్వకాలు జరపలేదు 
  • న్యాయ సలహా తీసుకుని పరువు నష్టం దావా వేస్తాం
తిరుమల తిరుపతి దేవస్థాన ఆభరణాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా, అవి భద్రంగానే ఉన్నాయని తాము ఇప్పటికే స్పష్టం చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ అన్నారు. ఈరోజు దేవస్థాన ధర్మకర్తల సమావేశం జరిగింది. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ నిన్న శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై స్పందించారు.

తిరుమలలో ఎలాంటి తవ్వకాలు జరపలేదని అనిల్‌ కుమార్ సింఘాల్‌ అన్నారు. ప్రతిరోజు వారు చేస్తోన్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలు చేస్తోన్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని, త్వరలోనే న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళతామని అన్నారు. ఇందుకోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే తాము లీగల్‌ నోటీసులు పంపుతామని అన్నారు.  
TTD
Tirupati
eo

More Telugu News