ambati: లోకేష్ కు కప్పం కడుతూ అందినంత దండుకుంటున్నారు!: యరపతినేనిపై అంబటి ఆరోపణ

  • సహజవనరులను దోచుకుంటున్న ఘనత యరపతినేనిదే!
  • అందినకాడికి యరపతినేని దండుకుంటున్నారు!
  • ఎక్కడా లేని విధంగా గురజాలలో దోపిడీ జరుగుతోంది
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సహజవనరులను దోచుకుంటున్న ఘనత యరపతినేనిదేనని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ కు కప్పం కడుతూ అందినకాడికి యరపతినేని దండుకుంటున్నారని, ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప, ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా గురజాలలో దోపిడీ జరుగుతోందని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ambati
yerapatineni

More Telugu News