Nara Lokesh: వారి కథతో 'ఏ1 మరియు అర డజన్ దొంగలు' సినిమా తీస్తే బాగుంటుంది!: మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా

  • వైకాపా ఎంపీల రాజీనామాలపై మంత్రి నారా లోకేశ్‌ విమర్శ
  • భాజాపాతో కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టించారు
  • రాజీనామా నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని ఎద్దేవా
వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజీనామాల విషయంలో వైసీపీ ఎంపీలు ఆడుతున్న నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. వారెవ్వా.. బీజేపీతో కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టించి గొప్ప నటన కనబర్చారని, వారి రాజీనామా డ్రామా కథతో "ఏ1 మరియు అర డజన్ దొంగలు" సినిమా తీస్తే బాగుంటుందని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు.
Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP

More Telugu News