Sri Reddy: నారా లోకేష్ ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు లేరు!: శ్రీరెడ్డి హెచ్చరిక

  • పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండా వ్యాఖ్యలు
  • కొత్త పార్టీ ఏం చేస్తుందో చెప్పుకోవాలని చురక
  • విమర్శలు చేసి తన నోటికి పని చెప్పద్దన్న శ్రీరెడ్డి
"నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతే... విమర్శలు చేస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు" అంటూ టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి ఎవరి పేరూ ఉదహరించకుండా తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. ఆపై మరో పోస్టులో "జగన్ అన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది? జగన్ అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు. సినిమా డైలాగు కొట్టి, వాటర్ తాగినంత ఈజీ కాదు. మీ అన్నయ్య రాజకీయాలు, మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలీదు. మా అసోసియేషన్ లో కార్డు, పీకే గారి మీద గౌరవంతో మీ అన్న నాకు ఇవ్వనివ్వట్లేదు. మీ చలవే కదా" అంటూ మరో పోస్టును పెట్టింది.

ఆపై ఇంకో పోస్టు పెడుతూ చేసిన వ్యాఖ్యలతో శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమైంది. "మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తరువాత, 5 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారని, వాళ్లకోసం సింగిల్ పైనా ఖర్చు పెట్టలేదని, ఎక్కడా కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదని, తిరుపతి ప్రజల ఉవాచ. చంద్రబాబుగారు తిరుపతికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకొని తప్పు పని చేయొద్దని మనవి" అని ఆ పోస్టులో పేర్కొంది.


Sri Reddy
Jagan
Nara Lokesh
Pawan Kalyan
Facebook

More Telugu News