Saina Nehwal: సైనాకు ఒక చోట, సింధుకు మరో చోట... వేర్వేరుగా శిక్షణ ఇస్తున్న గోపీచంద్!

  • కామన్ వెల్త్ పతకాలు సాధించిన తెలుగు తేజాలు
  • వేర్వేరుగా కోచింగ్ ఇవ్వాలని గోపీచంద్ నిర్ణయం
  • ఇద్దరికీ సమయం కేటాయిస్తున్నానన్న గోపీచంద్
ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించి తిరిగి వచ్చిన తెలుగు తేజాలు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు రెండు వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇవ్వాలని, ఒకే చోట ఇద్దరినీ కలిపి ఉంచరాదని కోచ్ పుల్లెల గోపీచంద్ నిర్ణయించుకున్నారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న గోపీచంద్, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. గతంలో తాను వేర్వేరు షెడ్యూల్స్ లో ఇద్దరికీ శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం కోచింగ్ జట్టు సమష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నానని వెల్లడించారు. ఈ రెండు శిక్షణా కేంద్రాలు అర కిలోమీటర్ దూరంలో ఉంటాయని ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇద్దరికీ చాలినంత సమయాన్ని తాను కేటాయిస్తున్నానని అన్నారు. 
Saina Nehwal
PV Sindhu
Pullela Gopichand

More Telugu News