ఇందిరకు పట్టిన గతే.. మోదీకి కూడా!: శరద్ పవార్
- నాడు ప్రజాస్వామ్యాన్ని ఇందిర అపహాస్యం చేశారు
- నేడూ నాటి పరిస్థితులే
- విభేదాలను పక్కనపెట్టి పార్టీలన్నీ ఏకం కావాలి
పార్టీలతో విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు మాత్రం అంతా కలిసి కట్టుగా ముందుకు రావాలని పవార్ పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో ఎన్సీపీ, కేరళలో లెఫ్ట్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో కాంగ్రెస్ బలంగా ఉందని పవార్ వివరించారు. ఇవన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎన్సీపీ అభ్యర్థి మధుకర్ కుకడేతో సమావేశం తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.