Pawan Kalyan: అప్పుడు నేను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు!: పవన్ కల్యాణ్

  • అప్పుడు పడిన కష్టాన్ని మర్చిపోలేను
  • స్వయంగా కారు నడుపుకుని ఆసుపత్రికి తీసుకెళ్లా
  • స్వీయ అనుభవాన్ని వివరించిన పవన్
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకులో ఉన్న పవన్ అక్కడి గిరిజన యువతతో సమావేశమయ్యారు. అక్కడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సదుపాయాలు, మహిళల స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా తన భార్య ప్రసవ సమయంలో తాను పడిన ఆందోళన గురించి చెప్పుకొచ్చారు.

తన భార్యకు డెలివరీ  సమయం రావడంతో ఎందుకైనా మంచిదని ఓ డ్రైవర్‌ను, ఐదుగురు సిబ్బందిని రెడీగా పెట్టానని, కానీ వారు సమయానికి అందుబాటులో లేకుండా పోయారని పేర్కొన్నారు. దీంతో తానే స్వయంగా కారు నడుపుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను పడిన ఆందోళన అంతా ఇంతా కాదన్నారు.

నగరంలో ఉండే తన పరిస్థితే అలా వుంటే, ఇక గిరిజన ప్రాంతాల్లోని గర్భిణుల పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారికి కూడా సదుపాయలు కల్పించాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఓట్ల కోసం ఇక్కడికి రాలేదన్న పవన్ వారి వెంట ఉంటానని హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Jana Sena
Araku
Visakhapatnam

More Telugu News