Amitabh Bachchan: అలాంటి విగ్గులు .. గెడ్డాలు చాలా చిరాకు పెడతాయి: అమితాబ్

షార్ట్స్‌లో చూడండి
అమితాబ్ గురించి తెలిసినవారు నిజమైన నటనకు నిలువెత్తు రూపమని ఆయన గురించి చెబుతారు. ఈ తరం నటీనటులతోను ఆయన పోటీపడుతుండటం విశేషం. అలాంటి అమితాబ్ తాజాగా తాను చేయబోయే 'బ్రహ్మాస్త్ర' గురించి .. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో చేయనున్న మరో సినిమాను గురించి ప్రస్తావించారు.

"ఈ రెండు సినిమాలు త్వరలోనే మొదలవుతాయి. సుజయ్ ఘోష్ సినిమా కోసం స్కాట్ ల్యాండ్ .. 'బ్రహ్మాస్త్ర' కోసం బల్గేరియా వెళ్లవలసి ఉంటుంది. ఈ సినిమాల్లో నేను ప్రోస్తెటిక్ మేకప్ తో నటించవలసి ఉంటుంది. ఈ తరహా మేకప్ నాకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. విగ్గుకు .. గెడ్డానికి గల జిగురు చాలా చిరాకు కలిగిస్తుంది. మున్ముందు ఈ సినిమాల చిత్రీకరణలో నేను నిర్విరామంగా పాల్గొనవలసి ఉంటుంది. ఈ ప్రోస్తెటిక్ మేకప్ పెట్టే టార్చర్ తలచుకుంటే ఇప్పటి నుంచే టెన్షన్ గా వుంటోంది" అంటూ ఆయన తన బ్లాగులో రాసుకొచ్చారు.   
Go Back to Shorts
Amitabh Bachchan

More Telugu News