200 ఏళ్ల నాటి భారత రెస్టారెంట్ మెనూ.. వేలం పాటలో రూ.7.58 లక్షలు పలికిన వైనం!
- 1810లో లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభించిన దీన్ మహ్మద్
- చేతి రాతతో ఉన్న రెస్టారెంట్ మెనూ
- బ్రిటీష్ సైన్యంలో పని చేసిన మహ్మద్
1759లో దీన్ మహ్మద్ జన్మించారు. విదేశాలకు వలస వెళ్లిన వారిలో ఈయన ముందు తరానికి చెందినవారు. బ్రిటీష్ పాలనలోని ఆర్మీలో ఆయన పని చేశారు. అనంతరం బ్రిటన్ కు వెళ్లారు. 'ది ట్రావెల్స్ ఆఫ్ డీన్ మాహోమెట్' పుస్తకాన్ని ఆయన రాశారు. ఇంగ్లీషులో ఓ భారతీయుడు రాసిన తొలి పుస్తకంగా దీని గురించి చెప్పుకుంటారు. బ్రిటన్ లో తొలి భారతీయ రెస్టారెంట్ ను ప్రారంభించింది కూడా ఈయనే.