govinda: తనను అనుకరించిన 'డ్యాన్సింగ్‌ అంకుల్‌'పై స్పందించిన బాలీవుడ్‌ హీరో గోవిందా

  • శ్రీవాత్సవ భార్య కూడా కాలు కదపడం బాగుంది
  • పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు
  • మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది
  • ఆయన ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి
బాలీవుడ్‌ నటుడు గోవిందా సినిమాలోని ఓ పాటకు సంజీవ్‌ శ్రీవాత్సవ అనే ఓ వ్యక్తి అదరహో అనేలా చేసిన డ్యాన్స్‌ వీడియో విపరీతంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 'డ్యాన్సింగ్‌ అంకుల్‌' అనే పేరుతో ఆయనకు చాలా పాప్యులారిటీ వచ్చింది. ఆయన డ్యాన్స్‌ చూసిన గోవిందా ఈ వీడియోపై స్పందించాడు. వేదికపై శ్రీవాత్సవతో పాటు ఆయన భార్య కూడా కాలు కదపడం చాలా బాగుందని ప్రశంసించారు.

ఏదో డాన్స్‌ చేస్తున్నట్లు కాకుండా ఆయన పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారని, ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని గోవిందా అన్నారు. ఆయన డాన్స్ చేసిన విధానం, ఎంజాయ్‌ చేసిన తీరు ఆనందింపజేసిందని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.                                    
govinda
Bollywood
dancing

More Telugu News