Nara Lokesh: కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా, బెయిల్ పై ఉన్న వ్యక్తి!: జగన్ పై నారా లోకేష్ విసుర్లు

  • జగన్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన లోకేష్
  • వైసీపీ నేతలంతా పలు నేరాల్లో ఉన్నవారేనంటూ విమర్శ
  • నేరాలను చంద్రబాబు ఉక్కుపాదంతో అణచివేశారంటూ ట్వీట్
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా పరోక్ష విమర్శలు గుప్పించారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచిన వ్యక్తి, 13 కేసుల్లో ఏ1, కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన పార్టీలోని నేతలంతా మర్డర్లు, కిడ్నాపులు, రేపులు, భూకబ్జాలు, ఎర్ర చందనం స్మగ్లింగ్, బెట్టింగ్, దోపిడీ లాంటి అన్ని నేరాల్లో ఉన్నారని అన్నారు. ఇంత చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఏపీలోని నేరాల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. అతని తండ్రి హయాంలో ఉన్న క్రైమ్ రేటును ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కుపాదంతో అణచివేశారని అన్నారు. 
Nara Lokesh
Chandrababu
Jagan
YSRCP

More Telugu News