Chandrababu: పవన్ కల్యాణ్ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో 'రచ్చబండ'లో పాల్గొన్న సీఎం   
  • ఏపీని మోదీ నమ్మించి మోసం చేశారు
  • బీజేపీతో కలసి వైసీపీ ద్రోహం చేస్తోంది
మొన్నటిదాకా టీడీపీతో కలసి ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... సడన్ గా యూటర్న్ తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. విజయనగరం జిల్లా జమ్మాదేవిపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడటం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని మోదీ నమ్మించి, మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీతో కలసి ఏపీకి వైసీపీ ద్రోహం చేస్తోందని విమర్శించారు. అంతకుముందు గ్రామంలోని వీధుల్లో చంద్రబాబు పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
Chandrababu
Pawan Kalyan
Narendra Modi
YSRCP
BJP

More Telugu News