Nara Lokesh: ప్రధాని మోదీలో స్పందన తెచ్చేందుకు నారా లోకేష్ యత్నం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ట్వీట్ చేశారు. ‘‘డియర్ నరేంద్రమోదీ సర్, తన హక్కుల కోసం రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ మీ ట్వీట్ తో చల్లబడుతుందని మీరు ఆలోచిస్తున్నట్టు అయితే మీరు తప్పకుండా ఇక్కడున్న కామెంట్స్ ను చూడాల్సిందే. మీరు చదివేందుకు కేవలం కొన్ని కామెంట్స్ ను యాడ్ చేస్తున్నాను. ఇవి మీ సోమవారాన్ని పాడు చేయవని ఆశిస్తున్నాను’’ అంటూ నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రధానిని ఉద్దేశించి యూజర్లు చేసిన కామెంట్స్ కొన్నింటిని లోకేష్ అటాచ్ చేశారు.

‘‘మీ శుభాకాంక్షలు అక్కర్లేదు. మాకున్న దానితో మేం ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నాం. మీరు తదుపరి విదేశీ పర్యటన గురించి ఆలోచించుకోండి’’
‘‘సారీ సర్ విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చేంత వరకు మేం బీజేపీకి ఓటు వేయం’’ ఇలా ఎవరి అభిప్రాయాలను వారు తమ కామెంట్స్ ద్వారా వ్యక్తపరిచారు.
Go Back to Shorts
Nara Lokesh
Narendra Modi

More Telugu News