Tamilnadu: రజనీకాంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కమలహాసన్!
- సమస్యల పరిష్కారానికి రోడ్లెక్కితే శ్మశానమే మిగులుతుందన్న రజనీకాంత్
- ఆందోళనకారులు సంఘ వ్యతిరేకులైతే, తానూ వారిలో ఒకడినేనన్న కమల్
- బెంగళూరుకు వెళుతూ ఎయిర్ పోర్టులో మీడియాతో కమల్
తమిళనాడు తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ను మూసివేయాలని జరిగిన నిరసనలు, పోయిన ప్రాణాలను ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కితే, తమిళనాడు శ్మశానంలా మారుతుందంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగగా, కమలహాసన్ తీవ్ర విమర్శలకు దిగారు.
'మక్కళ్ నీది మయ్యమ్' పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన కమల్, రజనీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలుసుకునేందుకు బెంగళూరుకు బయలుదేరిన ఆయన, చెన్నై ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులను సంఘ వ్యతిరేకులుగా భావించే పక్షంలో తాను కూడా సంఘ వ్యతిరేకినేనని అన్నారు. ఆందోళనలపై తుపాకులు గర్జించే పరిస్థితే వస్తే ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఓ లక్ష్య సాధనకు ఉద్యమాలు జరుగుతుంటాయని, ఆందోళనల సందర్భంగా హింస తలెత్తే పరిస్థితి ఏర్పడితే, హింసను తగ్గించాలని డిమాండ్ చేయాలే తప్ప, ఉద్యమాన్ని నీరుగార్చే వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.