janasena: జనసేన, వైసీపీలకు అంత సీన్ ఎక్కడుంది?: డొక్కా

  • చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి
  • దేశానికి బీజేపీ అవసరం లేదు
  • వైసీపీ, జనసేనలు దగాకోరు పార్టీలు
ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రమను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఏపీకే కాకుండా యావత్ దేశానికి కూడా బీజేపీ అవసరం లేదని అన్నారు. రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ, జనసేన పార్టీలకు బీజేపీని నిలదీసేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడమే వైసీపీ, జనసేనలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దగాకోరు పార్టీలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
janasena
YSRCP
Chandrababu
dokka manikyavara prasad

More Telugu News