పూరీ జగన్నాథుడి రత్నాల ఖజానా తాళం మాయం!
- హైకోర్టు ఆదేశాలతో భారీ భద్రత
- పూరీ శంకరాచార్య ఆగ్రహం
- ప్రతిపక్ష బీజేపీ ఆందోళన
హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4న భారీ భద్రత నడుమ 16 మందితో కూడిన బృందం రత్న భాండార్లోకి ప్రవేశించి భద్రతను సమీక్షించింది. ఐరన్ గ్రిల్స్ ద్వారా ఇన్నర్ చాంబర్స్ బయటి నుంచి కనిపిస్తుండడంతో తనిఖీ బృందం లోపలికి వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.
తాళం చెవులు పోయిన ఘటనపై తాజాగా పూరీ శంకరాచార్య స్వామి మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెంటనే స్పందించాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.