Cricket: సైకిల్‌ తొక్కి.. పిల్లలతో క్రికెట్‌ ఆడిన అఖిలేశ్‌ యాదవ్‌

  • ఇటీవలే ప్రభుత్వ బంగళా ఖాళీ చేసిన అఖిలేశ్
  • గోమ్టి నది తీరానికి వెళ్లిన యూపీ మాజీ సీఎం
  •  మార్నింగ్ వాక్‌ చేస్తోన్న వారితో ముచ్చట
ఉదయాన్నే సైకిల్‌ తొక్కి.. అనంతరం పిల్లలతో క్రికెట్‌ కాసేపు ఆడిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉత్సాహంగా గడిపారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ బంగళాలో ఉన్న అఖిలేశ్‌ ఇటీవల ఎట్టకేలకు దాన్ని ఖాళీ చేశారు. నిన్నటి వరకు వాకింగ్‌, సైక్లింగ్  వంటివి ప్రభుత్వ బంగాళాలోనే చేసుకున్న అఖిలేశ్, ఇప్పుడు కొత్త ఇంట్లో ఆ అవకాశం లేకపోవడంతో బయటకు వస్తున్నారు. గోమ్టి నది తీరానికి వెళ్లి అక్కడ మార్నింగ్ వాక్‌ చేస్తోన్న వారితో మాట్లాడారు. ఆయన క్రికెట్‌ ఆడుతుండగా తీసిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.                                               
Cricket
akhilesh yadav
Uttar Pradesh

More Telugu News