వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసి ప్రొద్దుటూరుకు తరలించిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డికి పట్టున్న ఆ ప్రాంతంలో వైసీపీ నేతల సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు సంజీవరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పెద్దదండ్లూరుకి వెళ్తుండగా ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆ గ్రామంలోకి ఆయన వెళితే ఉద్రిక్త పరిస్థితి మరింత చెలరేగే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ప్రొద్దుటూరుకు తరలించారు. పెద్దదండ్లూరులో పోలీసు బందోబస్తు పెంచారు.  
Go Back to Shorts
YSRCP
Telugudesam
Police

More Telugu News