Chandrababu: అప్పటికి చంద్రబాబుకి 102 ఏళ్లు వస్తాయి: జగన్‌ సెటైర్

  • 2050లో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతారట
  • చంద్రబాబు వయసు దాదాపు 70 సంవత్సరాలు
  • ఈ మనిషి 2050 గురించి మాట్లాడుతున్నారు 
  • అప్పటి వరకు దోచుకుంటూనే ఉందామని అనుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అవినీతిలో నెంబర్‌ 1 చేశారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన పాలన అంతా ప్రజలను మోసం చేయడం, మభ్యపెట్టడంతోనే ఉందని అన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ...  2050లో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అంటున్నారని ఎద్దేవా చేశారు.

"చంద్రబాబు నాయుడి వయసు ఎంతో తెలుసా? దాదాపు 70 సంవత్సరాలు.. ఈ మనిషి 2050 గురించి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పటికి ఆ మనిషికి 102 ఏళ్లు వస్తాయి. అంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ని దోచుకుంటూనే ఉందామని చంద్రబాబు అనుకుంటున్నారు. అన్ని ఏళ్లు బతికే శక్తి ఆయనకు ఉండొచ్చేమోగానీ, ఆయనను భరించే శక్తి ఏపీ ప్రజలకు లేదు" అని జగన్‌ అన్నారు.

ప్రత్యేక హోదాను చంద్రబాబు అమ్ముకోకపోతే మనం నిజంగానే నెంబర్‌ 1 అయ్యే వాళ్లమని జగన్‌ అన్నారు. కానీ ఆయన పాలనలో ఏపీ అత్యాచారాల్లో, అవినీతిలో, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంలో నెంబర్‌ 1గా ఉందని అన్నారు.  
Chandrababu
Jagan
Andhra Pradesh

More Telugu News