Chandrababu: బీజేపీతో అంటకాగుతున్న పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించండి: చంద్రబాబు

  • జొన్నగిరిలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
  • ప్రతి చెరువును నీటితో నింపుతామన్న సీఎం
  • రైతులు, మహిళలతో ముఖాముఖి
బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని చెరువులో 'జలహారతి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చెక్ డ్యామ్ ను పరిశీలించి, ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు, మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

అనంతరం సభలో ఆయన ప్రసంగిస్తూ, విపక్షాలపై మండిపడ్డారు. జిల్లాలో ఉన్న ప్రతి చెరువును నీటితో నింపుతామని రైతులకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే గ్రామదర్శిని, గ్రామ సభలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.
Chandrababu
jalaharathi
jonnagiri

More Telugu News