anandababu: జగన్‌, పవన్‌ ఒకరినొకరు విమర్శించుకోవట్లేదు!: మంత్రి నక్కా ఆనందబాబు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరినొకరు విమర్శించుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వారి తీరుని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధర్మపోరాట దీక్షను కొందరు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. జగన్‌ 'నయవంచన దీక్ష' పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మోదీని జగన్‌ ఒక్కమాట కూడా అనలేకపోతున్నారని మంత్రి ఆనందబాబు అన్నారు. సీఎం చంద్రబాబుపై బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించట్లేదని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామని భయపడుతున్నారని అన్నారు.       
Go Back to Shorts
anandababu
Jagan
Pawan Kalyan

More Telugu News