Tollywood: సెల్ఫీల విషయంలో కేటీఆర్ సరదా కామెంట్.. స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల 'భరత్ అనే నేను' చిత్రాన్ని చూసిన తరువాత చిత్ర టీమ్ ను ముఖ్యంగా మహేష్ బాబు, కొరటాల శివలను కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆపై ఈ చిత్రం తన జీవితానికి దగ్గరగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేటీఆర్ "మహేష్‌ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారు. నేను మాత్రం అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తాను" అని సరదాగా చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇక తాజాగా ఓ నెటిజన్, తాను కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ,  "నిజ‌మే... కేటీఆర్ గారు అబ్బాయిల‌కి కూడా సెల్ఫీలు ఇస్తారు" అనే కామెంట్ తో దాన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. దానిపై రీ ట్వీట్ చేస్తూ, మహేష్ బాబును ట్యాగ్ చేసి, "మహేష్... ఇది నీ కోసమే" అన్న కామెంట్ ను ఉంచారు. దీన్ని చూసిన మహేష్ ఓ చిన్న స్మైలీ ఎమోజీని పోస్టు చేశారు.
Go Back to Shorts
Tollywood
KTR
Mahesh Babu
Bharath Ane Nenu

More Telugu News