YSRCP: చంద్రబాబు టార్గెట్ గా '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృధ్వీ సంచలన కామెంట్స్!

  • చంద్రబాబు 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ
  • 40 ఏళ్ల జగన్ ను చూస్తే బాబుకు భయం
  • చంద్రబాబు పేరెత్తడం కూడా ఇష్టం లేదన్న పృధ్వీ
"నేను 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని సినిమాలు చేసుకుంటుంటే, చంద్రబాబు 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ పాలిటిక్స్ చేసుకుంటున్నారని" టాలీవుడ్ కమేడియన్ పృధ్వీ సెటైర్ వేశారు. నెల్లూరు జిల్లాలో వీఆర్సీ మైదానంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ 'వంచనపై దీక్ష' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు, 40 ఏళ్ల వయసున్న జగన్ ను చూసి ఎందుకంత భయమని ప్రశ్నించారు. తనకు చంద్రబాబు పేరెత్తడం కూడా ఇష్టం లేదని, ఆ పేరు తన నోటి నుంచి రావట్లేదని అన్నారు. జగన్ ను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
YSRCP
Jagan
Chandrababu
Nellore District
Prudhvi

More Telugu News