Telangana: తెలంగాణకు రాహుల్ గాంధీ.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు!

  • తెలంగాణలో పర్యటించనున్న రాహుల్
  • రంజాన్ తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్ర
  • ఒకటి రెండు సభల్లో ప్రసంగించనున్న కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటనకు రంగం సిద్ధమైంది. రంజాన్ తర్వాత కాంగ్రెస్ నేతలు చేపట్టే నాలుగో విడత బస్సు యాత్రలో రాహుల్ పాల్గొనడం దాదాపు ఖరారైంది. తేదీలు మాత్రం ఖరారు కావాల్సి ఉంది. పర్యటనలో భాగంగా రాహుల్ భారీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, జాయింట్ యాక్షన్ కమిటీ నిరుద్యోగులు పాల్గొననున్నారు.  రాహుల్ గాంధీ ఒకటి, రెండు భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్.ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.
Telangana
Congress
Rahul Gandhi

More Telugu News