Kodela: బురదజల్లాం... కడుక్కోండి అంటే ఎలా?... నిరూపిస్తే రాజీనామా చేస్తా: కోడెల

  • ఆరోపణలు నిరూపించి చూపండి
  • విమర్శిస్తున్న వారికి కోడెల సవాల్
  • నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ స్పీకర్
తనను విమర్శిస్తున్న వారు "బురదజల్లడం మా పని, కడుక్కోవడం మీపని" అన్నట్లు వ్యవహరిస్తున్నారని, తనపై చేస్తున్న ఏ ఆరోపణనైనా నిరూపిస్తే, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా  తప్పుకుంటానని కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు.

 గుంటూరు జిల్లా నరసరావుపేటలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, తాను నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతూనే, రాజకీయాలలో వున్నానని అన్నారు. డాక్టర్ వద్దకు డబ్బులతో వెళితే పని అవుతుందని చెప్పేవారు ఎవరైనా ఉంటే తన వద్దకు తీసుకురావాలని అన్నారు. విమర్శలు చేస్తే నమ్మేలా ఉండాలని హితవు పలికారు. అందరూ సుఖంగా, కలసిమెలసి ఉండాలన్నదే తన అభిమతమని, అందుకోసం నిద్రాహారాలు మానుకుని కృషి చేస్తానని కోడెల చెప్పారు.
Kodela
Narasaraopeta
Andhra Pradesh
Navanirmana Deeksha

More Telugu News