Chandrababu: వీఆర్ఏలకు చంద్రబాబు బంపర్ బొనాంజా!

షార్ట్స్‌లో చూడండి
గ్రామ రెవెన్యూ సహాయకులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.6 వేలుగా ఉన్న వారి వేతనాన్ని రూ.10,500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వీఆర్ఏల కష్టాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో వారి వేతనాలను మూడు రెట్లు పెంచినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఏ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
VRA

More Telugu News